ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోంది. ఇక ఈ మహమ్మారి దెబ్బకు అందరి షెడ్యూల్స్ మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా కూడా పెళ్లిపై కీలక నిర్ణయం తీసుకుంది.
నిజానికి హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ను త్వరలోనే మెహ్రీన్ పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. ఇటీవలె నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ జంట.. త్వరలోనే పెళ్లి కూడా ఉంటుందని ప్రకటించారు.
కానీ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లిని వాయిదా వేసుకున్నారట ఈ జంట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై మెహ్రీన్ స్పందిస్తూ.. అసలు దాని గురించే డిస్కస్ చేసుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడతాయని ఎదురు చూస్తున్నాం. అప్పటివరకూ పెళ్లి జరగదు అని తెలిపింది. కాగా, మెహ్రీన్ కూడా ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కరోనా నుంచి కోలుకుంది.