వెండితెర ఎంట్రీకి సిద్ద‌మైన ఆ స్టార్ హీరోయిన్‌ కూతురు!

ఒక‌ప్ప‌టి స్థార్ హీరోయిన్‌, అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్ప‌టికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతోంది.

అయితే ఇప్పుడు శ్రీ‌దేవి రెండో కూతురు, జాన్వీ చెల్లెలు ఖుషీ క‌పూర్ కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె అందాలకు మెరుగులు దిద్దుకోవడం .. నటనలో శిక్షణ తీసుకోవడం పూర్తయిందట.

దాంతో ఖుషీని కూడా వెండితెరకి పరిచయం చేయడానికి ఆమె తండ్రి, ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఇక ఈమెను కూడా మొద‌ట బాలీవుడ్‌లోకి దింపాల‌ని చూస్తున్నార‌ట‌. అది కుద‌ర‌ని ప‌క్షంలో టాలీవుడ్ లేదా కోలీవుడ్ సినిమాల ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నార‌ట‌. మ‌రి ఖుషీ మొద‌ట ఏ ఇండ‌స్ట్రీలో అడుగు పెడుతుందో చూడాలి.

Share post:

Latest