వామ్మో..పుష్ప రెండు భాగాల‌కు అంత ఖ‌ర్చు చేస్తున్నారా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం పుష్ప‌. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా, ఫహద్ ఫాజిల్ విలన్‌గా క‌నిపించ‌నున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లోనూ భారీగా బ‌డ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.

అయితే ఈ సినిమా బ‌డ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి ఏకంగా 250 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ట‌. ఇదే నిజ‌మైతే అల్లు అర్జున్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న‌ సినిమా ఇదే అవుతుంది.

Share post:

Latest