ఉప్పెన వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఉప్పెన విడుదలకు ముందే పలు ఆఫర్ల దక్కించుకున్న కృతికి.. ప్రస్తుతం మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మరియు రామ్ సరసన ఓ చిత్రం చేస్తోంది.
ఇప్పటికే చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్ వరించిందట. ప్రస్తుతం రిపబ్లిక్ చేస్తున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ఆ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం కృతి శెట్టిని సంప్రదించారట.
కానీ, కృతి మాత్రం ఈ ఆఫర్‌ను తిరస్కరించి.. సాయి ధరమ్ తేజ్‌కు షాకిచ్చిందట. ప్రస్తుతం చేతిలో ఎక్కువ ఆఫర్లు ఉండటం వల్లే.. ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలి.