చిరు-చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులు కాదంటున్న కొర‌టాల!

చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులు కాదంటున్నాడు స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ సిద్ధా అనే కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో చిరు, చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులుగా న‌టిస్తున్నార‌ని, చ‌ర‌ణ్ రోల్ చాలా చిన్న‌గా ఉంటుంద‌ని ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా కొర‌టాల ఈ వార్త‌ల‌పై ఓ క్లారిటీ ఇచ్చారు.

కొర‌టాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో చరణ్ చేస్తున్నది గెస్టు రోల్ కాదు. ఆచార్యలో మెయిన్ ఎమోష‌న్ చర‌ణ్ చుట్టూనే ర‌న్ అవుతుంది. సెకండాఫ్ దాదాపు త‌న పాత్ర క‌నిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి – చరణ్ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఆశయం పరంగానే వాళ్ల మధ్య అనుబంధం ఉంటుంది. ఇక ప‌దిరోజుల షూటింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది అని తెలిపారు.