చ‌ర‌ణ్‌-శంక‌ర్ సినిమా.. రంగంలోకి మ‌రో స్టార్ హీరో!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో చ‌ర‌ణ్ ఓ సినిమా చేయబోతున్న సంగ‌తి తెలిసిందే.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. జూలై నుంచి ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే తాజా సమాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం మ‌రో స్టార్ హీరోను రంగంలోకి దింపుతున్నాడ‌ట శంక‌ర్‌.

ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు.. క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్. శంకర్ అతనికి కాల్ చేసి కథ చెప్పడం .. తన పాత్రను గురించి తెలుసుకున్న సుదీప్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జ‌రిగిపోయాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Latest