భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ)కి ప్రతి సంవత్సరం కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాది మాత్రం కరోనా దెబ్బకు భారీ నష్టాన్ని మిగిల్చేలా ఉందని అంటున్నారు. ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు వరుసగా కరోనా బారిన పడటంతో అ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు.
మ్యాచులు మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయన్న విషయంపై ఇప్పటి వరకు ఇంకా స్పష్టత రాలేదు. అయితే టోర్నీ సజావుగా సాగి ఉంటే స్పాన్సర్లు, ప్రసారకర్తల నుంచి మొత్తం డబ్బులు బోర్డుకు బాగానే వచ్చేవి. కానీ, ఇలా అర్ధాంతరంగా ఐపీఎల్ వాయిదా పడటంతో..బీసీసీఐకి దాదాపు రూ. 2,200 కోట్ల మేర నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు.
60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా…ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లు మాత్రమే జరగడంతో అప్పటి వరకు మాత్రమే స్పాన్సర్లు, ప్రసారకర్తలు డబ్బును చెల్లిస్తారు. దాంతె బీసీసీఐకి రావాల్సిన ఆదాయంలో 50 శాతం కోత పడుంది. అయితే ఒకవేళ పరిస్థితులు చక్కబడి మళ్లీ మ్యాచుల్ కొనసాగితే.. నష్టాల్లో నుంచి బీసీసీఐ బయట పడవచ్చు. చూడారి మరి ఏం జరుగుతుందో.