తన పై వచ్చిన రూమర్లకు చెక్‌ పెట్టిన నటి..?

టాలీవుడ్ లో సన్నని నడుము వంపులతో కుర్రకారు మతులు పోగొట్టిన భామ గోవా బ్యూటీ ఇలియానా. ఇటీవలే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె పై వచ్చిన పలు పుకార్ల గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలిపింది. తను గర్భవతిగా ఉన్న టైములో అనేక రూమర్లు సృష్టించారని ఇలియానా అంది. నా గురించి చాలా రుమౌర్స్ వచ్చాయి. నేను అబార్షన్‌ చేసుకోబోతున్నానని , ఆత్మహత్యకు ప్రయత్నించానని నా పని మనిషి చూసి అడ్డుకుందని రుమౌర్స్ సృష్టించారు.

అవి విని నేను చాలా బాధ పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. అసలు తనకు పనిమనిషి ఏ లేదని, తానెప్పుడూ ఆత్మహత్యకు ప్రయత్నించలేదు అంటూ వివరించింది ఇలియానా. నేను చావలేదు, బతికే ఉన్నాను. అసలు ఇలాంటి పనికిమాలిన వార్తలు వారికి ఎక్కడ దొరుకుతాయో అసలు అర్థం కాదు అంటూ ఇలియానా వాపోయింది. ఇదే కాకుండా గతంలో తన బాయ్‌ ఫ్రెండ్‌ ఆండ్రూ నీబోన్‌తో కలిసి ఇలియానా ఒక బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నట్లు వార్తలువచ్చాయి. దీనిపై ఆమె తీవ్రంగా మండిపడి, తాను ప్రెగ్నెంట్ కాదంటూ రూమర్లకు పై క్లారిటీ ఇచ్చింది ఇలియానా .

Share post:

Latest