బాల‌య్య త‌ర్వాత ఆ మాస్ హీరోతో బోయ‌పాటి?

మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీకాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

అయితే ఈ చిత్రం త‌ర్వాత బోయ‌పాటి శ్రీ‌ను ఏ హీరోతో చేయ‌బోతున్నాడ‌నే ప్ర‌శ్న అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో బోయ‌పాటి త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

Killer Ravi Teja a Cop in Khiladi? - tollywood

ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Share post:

Popular