లాక్‌డౌన్ వేళ సీఎం కేసీఆర్‌కు డాక్ట‌ర్లు బిగ్ షాక్‌?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్ రూపంలో విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను క‌రోనా కుదిపేస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. తెలంగాణ‌లోనూ ఇటీవ‌లె లాక్‌డౌన్ విధించారు.

అయితే ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో సీఎం కేసీఆర్‌కు డాక్ట‌ర్లు బిగ్ షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి విధులను బహిష్కరిస్తామని సమ్మె నోటీసు విడుదల చేసింది తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం.

స్టైపెండ్‌ను జనవరి 2020 నుంచి పెంచాలని, విధినిర్వహణలో మృతి చెందిన జూడాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, జూడాలకు బీమా సౌకర్యంతోపాటు కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో కరోనా వైద్యం అందించాలని వారు డిమాండ్‌ చేశారు. ఇక మ‌రోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తాము కూడా సమ్మె చేపడుతామని తెలంగాణ సీనియర్ డాక్టర్ల అసోసియేషన్ హెచ్చరించింది.