రవితేజ-రామ్‌ల‌తో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్ట‌ర్‌?

అప‌జ‌య‌మే లేకుండా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ హీరోలుగా ఎఫ్‌3 అనే మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 2019లో వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్టైన ఎఫ్‌2 చిత్రానికి ఇది సీక్వెల్‌.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. అనిల్ మ‌రో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోలుగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతుంద‌ట‌.

ఇటీవ‌లె ర‌వితేజ్‌, రామ్‌ల‌కు ఓ మంచి మ‌ల్టీస్టార‌ర్ క‌థ వినిపించ‌గా.. అది ఇద్ద‌రికీ న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశార‌ట‌. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఇప్పటికే రెడీ అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా కూడా అనిల్ సినిమాల శైలిలోనే ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉండనుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Popular