బ‌న్నీ ఖాతాలో మ‌రో సెన్సేషన‌ల్ రికార్డ్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన చిత్రం అల వైకుంఠపురములో. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాలోని పాటలన్ని సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఇందులోని బుట్ట బొమ్మ సాంగ్ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా.. బ‌న్నీ ఖాతాలో ఎన్నో రికార్డుల‌ను ప‌డేలా కూడా చేసింది. ఇక తాజాగా బ‌న్నీ మ‌రో సెన్సేషన‌ల్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

తాజాగా బుట్ట‌బొమ్మ సాంగ్ 400 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. దీంతో యూట్యూబ్‌లో నాలుగు మిలియన్ల లైకులు సాధించిన ఏకైక‌ తెలుగు సాంగ్‌గా నిలిచింది. కాగా, థమన్‌ సంగీతం అందించిన ఈ సాంగ్‌ను అర్మాన్‌ మాలిక్‌ పాడాడు. ఈ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

Share post:

Popular