కరోనా నుంచి కోలుకున్న బన్నీ..!?

May 12, 2021 at 11:45 am

అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఈ మధ్యే బన్నీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా బన్నీకి టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్నే స్వయంగా బన్నీ సోషల్ మీడియా వేదికగా “అందరికి హాయ్.. 15 రోజుల క్వారంటైన్ అనంతరం, ఇప్పుడు జరిపిన టెస్టులలో కరోనా నెగిటివ్ గా వచ్చింది. నాకోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్ డౌన్ పనిచేస్తుందని నమ్ముతున్నాను. బీ హోం. బీ సేఫ్.. అంటూ తెలిపారు.

ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది. బన్నీ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. కరోనా సమయంలోనూ ఎలాంటి విరామం తీసుకోకుండా పుష్ప సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ కరోనా బారిన పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు కరోనా నెగిటివ్ రావడంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్న బన్నీ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts