ఎన్టీఆర్‌-త్రివిక్ర‌మ్ సినిమా ఆగ‌డానికి ప‌వ‌నే కార‌ణ‌మా?

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎన్టీఆర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో సినిమా చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు.

ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాయి. ఈ సినిమా విష‌యం పక్క‌న పెడితే.. అస‌లు ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఎందుకు ఆగిపోయింది అన్న‌ది మాత్రం ఎవ‌రికీ అర్థం కాలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవ‌డానికి కార‌ణం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నే అని టాక్ న‌డుస్తోంది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే..పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్ కు త్రివిక్రమ్..స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ మీదే కొన్ని నెలలుగా త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్ కోసం అనుకున్న కథ పూర్తి స్థాయిలో సిద్దం చేయలేదట. ఈ కారణంగానే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రావాల్సిన సినిమా ఆగిన‌ట్టు టాక్ న‌డుస్తోంది.

Share post:

Latest