ఓటీటీలోకి `వ‌కీల్ సాబ్‌`..ఇంత త్వ‌ర‌గా రావ‌డానికి అదే కార‌ణ‌మ‌ట‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం `వ‌కీల్ సాబ్‌`. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదల తేదీ గురించి అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన చేసింది. ఏప్రిల్ 30న స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సినిమాను 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్​రాజు స్పష్టం చేశారు.

మ‌రి ఇంత త్వ‌ర‌గా వ‌కీల్ సాబ్ ను ఓటీటీలోకి తీసుకురావ‌డానికి కార‌ణం ఏంటా అని అంద‌రూ ఆలోచిస్తున్నారు. అయితే ఆల‌స్యంగా కంటే త్వరగా స్ట్రీమింగ్ కు వస్తే ప్రైమ్ నుంచి ఎక్కువ మొత్తంలో ధర వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మేకర్స్ ఇలా చేసి ఉండొచ్చని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో ప‌క్క‌న పెడితే.. వ‌కీల్ సాబ్ త్వ‌ర‌గా ఓటీటీలోకి రావ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

https://twitter.com/PrimeVideoIN/status/1386991009565798404?s=20