వ్యాక్సిన్ పేరుతో మోసాలు..ఈ వీడియో చూస్తే బిత్తెర‌పోవ‌డం ఖాయం!

April 28, 2021 at 8:36 am

క‌రోనా వైర‌స్ సద్దుమణిగింది హ‌మ్మ‌య్య! అని అనుకునేలోపే మ‌ళ్లీ ఈ మ‌హ‌మ్మారి వేగంగా విజృంభిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మ‌రోవైపు క‌రోనాను నిర్మూలించేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా విసృతంగా కొన‌సాగుతోంది.

అయితే ఈ వ్యాక్సిన్ విష‌యంలో కూడా కొంద‌రు కేటుగాళ్లు న‌యా దందాల‌కు పాల్ప‌డుతున్నారు. క‌రోనా కోర‌లు చాస్తున్నా.. వీరిలో మార్పు రావ‌డం లేదు. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ డ‌బ్బులు గుంజుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఇలాంటి వీడియోనే ఒక‌టి తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో వ్యాక్సిన్ తీసుకునేందుకు ఓ వ్యక్తి కూర్చున్నాడు.

అతడి ఎడమ చేతి భుజానికి టీకా వేసేందుకు నర్స్ కాటన్‌తో క్లీన్ చేసింది. ఆ పై టీకా ఉన్న సిరంజిని అతడి చేతికి గుచ్చి వెంటనే తీసేసింది. మందును మాత్రం ఇంజక్ట్ చేయలేదు. లబ్ధిదారుడు మాత్రం తాను టీకా తీసుకున్నట్టే భావించాడు. వ్యాక్సిన్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు నమ్మిస్తున్న‌ట్టు ఈ వీడియోలో స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో..నెటిజ‌న్లు బిత్తెర‌పోతున్నారు.

వ్యాక్సిన్ పేరుతో మోసాలు..ఈ వీడియో చూస్తే బిత్తెర‌పోవ‌డం ఖాయం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts