విడుద‌ల రోజే టీవీలో ప్ర‌సార‌మైన `వ‌కీల్ సాబ్‌`..ఎక్క‌డంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ల‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఈ చిత్రం దుమ్ముదులిపేస్తోంది. ఇదిలా ఉండ‌గా.. కొత్త సినిమా వస్తుంది అంటే పైరసి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే వ‌కీల్ సాబ్‌పై క‌రోనా పైర‌సి దెబ్బ ప‌డింది. వకీల్ సాబ్ సినిమాను ఏకంగా విడుదలైన రోజే వైజాగ్‌లోని ఓ టీవీ కేబుల్ ఛానెల్‌లో ప్రసారం చేసారు.

ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ విష‌యం ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. ఇక ఈ విష‌యం తెలుసుకున్న వ‌కీల్ సాబ్ యూనిట్‌.. స‌ద‌రు ఛానెల్‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ఈ విష‌యం నెట్టింట్లో వైర‌ల్ కావ‌డంతో.. ప‌వ‌న్ ఫ్యాన్స్ స‌ద‌రు టీవీ ఛానెల్‌పై మండిప‌డుతున్నారు.

Share post:

Popular