ప‌వ‌న్ గురించి మాట్లాడ‌మ‌న్న నెటిజ‌న్‌..రేణు షాకింగ్ రిప్లై!

April 15, 2021 at 7:48 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, సినీ న‌టి రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన రేణు.. సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు, పిల్ల‌ల‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉండే రేణు.. త‌ర‌చూ నెటిజ‌న్ల‌తో కూడా మ‌చ్చ‌టిస్తుంటారు.

ఇక తాజాగా ఇన్‌స్టాలో నెటిజన్స్‌తో లైవ్‌ చాట్ చేశారీమె. ఈ లైవ్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానం ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ ప‌వ‌న్ గురించి మాట్లాడ‌మ‌ని ప్ర‌శ్నించారు. ఇందుకు రేణు షాకింగ్ రిప్లై ఇచ్చింది. `ఏమని మాట్లాడమంటారు? మీరేమో మాట్లాడమంటారు.

నేను మాట్లాడటం మొదలు పెట్టగానే రేణుకి పనిలేదు.. ఎప్పుడూ పవన్‌ గురించే మాట్లాడుతుంటుందని మీరే అంటారు. నాపై కామెంట్స్‌ చేస్తారు. అందుకే లైవ్ కు రావాలంటే కష్టంగా ఉంటోంది` రేణు తెలిపింది. దీంతో రేణు వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి.

ప‌వ‌న్ గురించి మాట్లాడ‌మ‌న్న నెటిజ‌న్‌..రేణు షాకింగ్ రిప్లై!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts