ముంబైలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన సన్నీ..!

April 8, 2021 at 3:16 pm

బాలీవుడ్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి స‌న్నీలియోన్ ఇప్పుడు త‌న‌కంటూ ఒక గూడు ఏర్పాటు చేసుకుంది. అదే సొంతిళ్లు కొనుగోలు చేసింది సన్నీ. ముంబైలోని అంధేరి స‌బ‌ర్బ‌న్‌లో స‌న్నీలియోన్ రూ.16 కోట్లు పెట్టి 4,365 చ‌ద‌ర‌పు అడుగుల విశాలమయిన అపార్టుమెంట్ ఒకటి కొన్నది. దీని కోసం స‌న్నీలియోన్ మార్చి 28న రూ.48 ల‌క్ష‌లు స్టాంప్ డ్యూటీ కట్టినట్లు రికార్డుల్లో న‌మోదైంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు అదే 12వ అంత‌స్థు అట్లాంటిస్‌కు క్రిస్ట‌ల్ ప్రైడ్ డెవ‌ల‌ప‌ర్స్ డిజైన్ వ‌ర్క్స్ చేశారు.

అపార్టుమెంట్ లో మూడు మెక‌నైజ్‌డ్ కారు పార్కింగ్ సౌక‌ర్యం కూడా ఉన్న‌ట్టు సమాచారం. అంతే కాకుండా స‌న్నీలియోన్ త‌న అస‌లు పేరు క‌ర‌ణ్‌జిత్ కౌర్ వోహ్రా పేరుతో ఈ అపార్టుమెంట్ ని రిజిస్ట‌ర్ చేయించుకుంది. స‌న్నీలియోన్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఇంత కాలానికి ముంబైలో త‌న‌కంటూ ఓ సొంతింటిని నిర్మించుకోవ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు స‌న్నీ అభిమానులు.

ముంబైలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన సన్నీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts