ప్రియా వారియర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్..ఎన‌ర్జిటిక్ స్టార్‌తో రొమాన్స్‌?

కను సైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ భామ ప్రియాప్రకాశ్‌ వారియర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నితిన్ హీరోగా తెర‌కెక్కిన `చెక్‌` సినిమాతో ఇటీవ‌లె తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ప్రియా వారియ‌ర్‌.. త‌న రెండో సినిమాను జాంబిరెడ్డి హీరో తేజ సజ్జ తో కలిసి `ఇష్క్` చేసింది.

- Advertisement -

ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో రొమాన్స్ చేసే ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం ప్ర‌స్తుతం తమిళ్ డైరెక్టర్ లింగు స్వామితో రామ్ ఓ చిత్రం చేస్తున్నారు.

ఈ చిత్రం త‌ర్వాత మారుతి దర్శకత్వంలో చేయబోతున్నాడని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ చిత్రంలోనే ప్రియా వారియ‌ర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశార‌ని ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Popular