ర‌ష్మిక దెబ్బ‌కు బెంగ పెట్టుకున్న పూజా హెగ్డే..ఏమైందంటే?

త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్, అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేస్తున్న పూజా.. తమిళం లో దళపతి విజయ్ 65వ సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది.

అయితే ఇప్పుడు ఈ బ్యూటీల‌కి బెంగ ప‌ట్టుకుంద‌ట‌. అందుకు కార‌ణం ర‌ష్మికనే అని అంటున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హీరోలైనా, హీరోయిన్లనైనా.. ఇష్టపడితే గుండెల్లో చోటివ్వడమే కాదు చందాలేసుకుని గుడి కట్టించేంత గాఢంగా అభిమానిస్తారు తమిళ ఫ్యాన్స్. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా నేలకేసి కొట్టేస్తారు. ఇటీవ‌ల ర‌ష్మిక విష‌యంలోనూ అదే జ‌రిగింది.

కార్తీ హీరోగా తెర‌కెక్కిన `సుల్తాన్` సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ర‌ష్మిక. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌డంతో.. అందుకు రష్మికే కారణమని భావిస్తూ ఆమె ఫోటోకు గుండుకొట్టి మ‌రీ కోలీవుడ్ స‌ర్కిల్స్‌లో ట్రెండ్ చేశారు. అయితే దాదాపు 18 ఏళ్ల గ్యాప్ తర్వాత స్టార్ విజ‌య్ సినిమాతో కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది పూజా. ఈ సినిమా రిజ‌ల్ట్ లో ఏదైనా తేడా వ‌స్తే.. త‌న‌కు కూడా ఇదే ట్రీట్‌మెంట్ ఇస్తారా అనేది పూజమ్మ బెంగ.

Share post:

Popular