మ‌రో రేర్ ఫీట్ అందుకున్న బుట్ట‌బొమ్మ‌..ఫొటో వైర‌ల్‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ముకుంద` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన పూజా.. అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు వెల్లువెత్త‌డంతో పాటు సూప‌ర్ హిట్లు కూడా బాగానే ప‌డ్డాయి.

దీంతో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ బుట్ట‌బొమ్మ‌. ప్ర‌స్తుతం తెలుగులో ఆచార్య, మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌, తమిళంలో విజయ్‌ సరసన ఓ చిత్రం మ‌రియు పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాధేశ్యామ్‌లో పూజా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇన్‌స్టాగ్రామ్ లో పూజా రేర్ ఫీట్ అందుకుంది.

తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాలో 13 మిలియన్ల ఫాలోవర్ల మార్క్‌ను అధిగమించింది. దీంతో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ క‌లిగిన అతి తక్కుమ మంది హీరోయిన్ల జాబితాలో పూజా కూడా చేరింది. ఈ సంద‌ర్భంగా త‌న ఫాలోవ‌ర్స్‌కు థ్యాంక్స్ చెబుతూ ఓ క్యూట్ ఫొటోను షేర్ చేయ‌గా.. ప్ర‌స్తుతం ఆ ఫొటో వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/CN7gUv4hb7I/?utm_source=ig_web_copy_link