ఓటిటి లో విడుదలకు సిద్దమవుతున్న పవన్ సినిమా..!?

మూడేళ్ల గ్యాప్‌ తర్వాత వకీల్‌ సాబ్‌ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన వకీల్‌ సాబ్ మూవీ ఏప్రిల్‌ 9న థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో అంత త్వరగా ప్రసారం చేయొద్దని అప్పట్లో అనుకున్నారు. కలెక్షన్లు కూడా ఒక రేంజ్‌లో రావడంతో అందులో పవన్‌ కళ్యాణ్ కూడా తన వాటా సైతం తీసుకున్నట్లు పలు వార్తలు వినిపించాయి.

ఇదిలా వుంటే ఇప్పుడు థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని మళ్ళి ఓటీటీలో ప్రసారం చేసేందుకు డీల్‌ కుదుర్చుకున్నారట మేకర్స్. వచ్చే నెల 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో దీన్ని స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఫిల్మీదునియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రాన్ని అదేరోజు ఓటీటీలో విడుదల చేస్తారా లేక విడుదల తేదీలో ఏమైనా మార్పులు ఉంటాయా అన్న విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share post:

Latest