కరోనాలోనూ ఆ పని కానిచ్చేస్తున్న నాని..ఆశ్చ‌ర్య‌పోతున్న ఫ్యాన్స్!

ప్ర‌స్తుతం ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా దెబ్బ‌కు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా హీరోలంద‌రూ త‌మ సినిమా షూటింగ్స్ ఆపేసి.. ఇంట్లో ఉంటున్నారు. అలాగే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు విడుద‌ల వాయిదా ప‌డుతున్నాయి.

ఇలాంటి త‌రుణంలోనూ న్యాచుర‌ల్ స్టార్ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాన్ని పూర్తి చేసిన నాని.. రాహుల్ సంకృత్యన్ తో `శ్యామ్ సింగ రాయ్` అనే భారీ బడ్జెట్ చిత్రంతో పాటు వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో `అంటే సుందరానికి..!` సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ రెండూ సెట్స్ మీదే ఉన్నాయి.

కరోనా కారణంగా చాలా సినిమాలు పేకప్ చెప్పేసుకుని లొకేషన్లు వదిలేసి వెళ్లిపోయాయి. కానీ నాని మాత్రం ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ ఉండటం విశేషం. ఈ రెండు చిత్ర యూనిట్స్ తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ రెండు సినిమా షూటింగ్స్ పూర్తి కానున్నాయ‌ని తెలుస్తోంది. మొత్తానికి క‌రోనా వేళ నాని డేరింగ్ చూసి ఫ్యాన్స్‌తో పాటు నెటిజ‌న్లు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Share post:

Latest