`ఆచార్య‌` రిలీజ్ డేట్‌పై క‌న్నేసిన టాలీవుడ్ యంగ్ హీరో!

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలని అనుకున్న‌‌ప్ప‌టికీ..అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

- Advertisement -

ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నాగ చైత‌న్య ఆచార్య రిలీజ్ డైట్‌పై క‌న్నేశార‌ని తెలుస్తోంది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్లవి హీరో,హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం `ల‌వ్ స్టోరీ`. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

కానీ, క‌రోనా కార‌ణంగా విడుద‌ల వాయిదా వేశారు. దీంతో చైతు మ‌రియు సాయి ప‌ల్ల‌వి ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ‌కు గుర‌య్యారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. లవ్ స్టోరీ చిత్రాన్ని ఆచార్య సినిమా డేట్ కి విడుదల చేయాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌కట‌న కూడా రానుంద‌ట‌.‌

Share post:

Popular