ఆదిపురుష్ కోసం తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్న‌ సీత!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `ఆదిపురుష్‌` ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణ మహాకావ్యం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. అలాగే లంకేశ్వర రావణాసుడి పాత్రని సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈసినిమా వచ్చే ఏడు ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సీత పాత్ర ఎలా ఉండాలో అందుకు తగ్గట్టుగా దర్శకుడు సూచనల మేరకు కృతిసనన్ సన్నబడటానికి తెగ శ్రమిస్తోందట. స్లిమ్ లుక్ కోసం కఠినమైన డైట్ ఫాలో అవుతోందట.

ఈ సినిమాలో సీత పాత్రకు డైలాగులు చాలానే ఉంటాయట. అందుకే సొంతగా డబ్బింగ్ చెప్పుకునేందుకు కృతి రెడీ అయింది. అందుకోసం నిపుణుడైన కోచ్‌ని నియమించుకుని భాషకు సంబంధించిన శిక్షణ కూడా తీసుకుంటుందట‌. మొత్తానికి ఆదిపురుష్ కోసం సీత తీవ్రంగానే క‌ష్ట‌ప‌డుతుంద‌న్న‌మాట‌.

Share post:

Latest