థ్రిల్లింగ్‌గా ర‌వితేజ `ఖిలాడీ` టీజ‌ర్!

`క్రాక్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత మాస్ మ‌హారాజా రావితేజ న‌టిస్తున్న చిత్రం `ఖిలాడీ`. రమేష్ వర్మ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ ద్విపాత్రాభినయం చేస్తుండ‌గా.. యాక్షన్ కింగ్ అర్జున్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు.

అలాగే ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఎలాంటి డైలాగ్స్ లేకుండా జస్ట్ విజువల్స్ మరియు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ టీజ‌ర్‌ను చాలా సూప‌ర్ థ్రిల్లింగ్ గా చూపించారు.

రవితేజ జైలులో ఉండటం.. సుత్తి పట్టుకుని క్రూరంగా మనుషులను వేటాడటం ఈ టీజ‌ర్‌లో చూపించారు. దీని బ‌ట్టీ చూస్తే ర‌వితేజ విభిన్న‌మైన పాత్ర చేస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. ఇక సుజిత్ వాసుదేవ్ మరియు జి.కె. విష్ణు అందించిన విజువల్స్ ఈ టీజ‌ర్‌కు అదనపు ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి ఈ టీజ‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో పాటు సినిమాపై అంచ‌నాల‌ను కూడా పెంచేశాయి.

Share post:

Popular