12 ఏళ్ల‌కే అవి మొద‌ల‌య్యాయి..ఇలియానా తీవ్ర ఆవేద‌న‌!

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేవదాసు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. మొద‌టి చిత్రంతోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పోకిరి సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. ఇలియానా వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకొని తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. అయితే ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు క్రేజ్ ఏమాత్రం లేద‌నే చెప్పాలి. హిందీలోనే ఒకటి రెండు చిన్నా చితకగా ప్రాజెక్ట్ లను చేస్తున్న ఇలియానా.. సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె ఎన్నో బాడీ షేమింగ్ విమర్శలను ఎదుర్కొంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా.. త‌న‌పై వ‌స్తున్న బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

ఈ బాడీ షేమింగ్ ట్రోల్స్ అనేవి ఈమద్య వస్తున్నవి కావు.. తాను 12 ఏళ్ల వయసు లో ఉన్నప్పటి నుండే మొదలు అయ్యాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత కూడా చాలా మంది నన్ను బాడీ షేమింగ్ తో విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. సోష‌ల్ మీడియాలో ప‌దికి పైగా మెసేజ్ లు బాడీ షేమింగ్ గురించే ఉంటాయి. మొద‌ట్లో చాలా కోపం వ‌చ్చేది. కానీ, ప్రతి గాయం తనను తాను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చిందని ఇలియానా పేర్కొంది.