వాక్సిన్ తీసుకున్న గంగ‌వ్వ‌..నొప్పితో కేకలు.!

బిగ్ బాస్ సీజ‌న్ 4 షోలో గంగ‌వ్వ అతి త‌క్కువ టైంలోనే ఎంతో మంది ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ కార్య‌క్ర‌మంతో ఆమె పాపులార్ కాగా, బిగ్ బాస్ షోతో మ‌రింత ఆద‌ర‌ణ పొందింది. ఇటీవలే వైల్డ్ డాగ్ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా నాగార్జున‌తో క‌లిసి ఫుల్ సందడి చేసింది గంగ‌వ్వ‌. ప్ర‌స్తుతం దేశ‌మంత‌టా క‌రోనా సెకండ్ వేవ్ ఉన్న క్రమంలో గంగ‌వ్వ క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నాడు ఆమె వ్యాక్సిన్ పొందింది.

వ్యాక్సిన్ ఇచ్చే టైములో నొప్పి భ‌రించ‌లేక గంగ‌వ్వ కేక‌లు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్ర‌స్తుతం గంగ‌వ్వ జ్వ‌రంతో పాటు ఒళ్లు నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు సమాచారం. వ్యాక్సిన్ ఇచ్చిన త‌ర్వాత ఈ ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని, దీనికి పెద్దగా భయపడాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్యులు అంటున్నారు.