ఆ స్టార్ హీరోతో ర‌గ‌డ‌కు రెడీ అవుతున్న వెంకీ-వ‌రుణ్‌?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా స‌క్సెస్‌ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఎఫ్-3`. 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఎఫ్‌-2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్‌-3 తెర‌కెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఎఫ్ 3 సినిమా.. ఈ ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. అనిల్ రావిపూడి మ‌న‌సు మార్చుకున్నార‌ట‌. ఈ చిత్రాన్ని ఆగ‌స్టులో కాకుండా.. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే.. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌కు, వెంకీ-వ‌రుణ్‌ల‌కు మ‌ధ్య బాక్సాఫీస్ ర‌గ‌డ రాజుకుంటుంది. ఎందుకంటే, మ‌హేష్ బాబు-ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న స‌ర్కారు వారి పాట చిత్రం కూడా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. మ‌రి రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుద‌ల అయితే..బాక్సాఫీస్ వార్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

Share post:

Popular