వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిరు..!?

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు చిరు. అతి త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న కొత్త చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇక మెహర్ రమేష్, బాబీ కూడా మెగాస్టార్‌తో మూవీ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ విన్నారా మెగాస్టార్ చిరు.

గత కొంతకాలంగా ఈ కథ పైనే ఫోకస్ చేస్తూ వచ్చిన వంశీ పైడిపల్లి, చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేశాడట. కాగా, మహేష్ బాబుతో మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేసారు వంశీ పైడిపల్లి. ఇటీవలే ఈ చిత్రం జాతీయ అవార్డును కూడా దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత వంశీ ఏ సినిమా సైన్ చెయ్యలేదు. తన తదుపరి చిత్రం మెగాస్టార్ చిరుతో చేస్తాననే నమ్మకంతో ఉన్నాడట వంశి.

Share post:

Latest