ఓటీటీతో డీల్ కుదుర్చుకున్న బాలయ్య సినిమా…!?

సింహా, లెజెండ్ సినిమాలు తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ అఖండ. ఇటీవలే మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీనితో అటు బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 28న రిలీజ్ కానున్న ఈ మూవీ తాజాగా ఓటీటీ డీల్ సహా శాటిలైట్ డీల్ కూడా పూర్తయిందనిసమాచారం. మాటీవీ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకుంది.

ఇంకా ఓటీటీ రైట్స్‌ను హాట్ స్టార్ భారీ మొత్తానికి సొంతం చేసుకుందని టాక్. మూవీ టీజర్‌లో నట సింహం బాలయ్య తన చేతిలో త్రిశూలం మెడలో రుద్రాక్షలతో అఘోరా గెటప్ లో కనిపించి ప్రేక్షశకులో సంచలనాలు సృష్టించాడు. ఈ పాత్రలో అతడి గెట్ అప్ చూసి ఫుల్ క్రేజ్ రావటంతో డీల్‌ పై ఫుల్ హైప్ పెరిగింది. గత చిత్రాల కన్నా ఈ సినిమా పై బాలయ్య అభిమానులలోను భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా చేస్తుంది.

Share post:

Latest