రైతుల కోసం మరో పథకం అమలు చేయనున్న జగన్ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 2019 ఆర్బిఐ కి సంబంధించిన రుణాల పై వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని సీఎం జగన్ అన్నారు. ప్రపంచమంతా రైతు పైనే ఆధారపడి జీవిస్తోందన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ఈ రెండేళ్లలో అమలు చేశామని ఆయన సగర్వంగా చెప్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన హామీల్లో అమల్లో భాగంగా 6లక్షల 28వేల మంది రైతులకు 2019 రబీ వడ్డీ రాయితీ కింద వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకం కింద రూ.167 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నమన్నారు.

2019-20 రబీలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి ఈ పథకం ద్వారా లాభం చేకూరుతోందన్నారు. ఇప్పటివరకు రైతులకు దాదాపు 1300 కోట్లు రైతులకు సున్నావడ్డీ రాయితీ ఇచ్చామన్నారు. రైతులు నష్టపోకుండా ఈ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతిపథకంలోనూ రైతులకు పెద్దపీట వేస్తుందన్నారు జగన్.