ఆ పరీక్షలు రద్దు చేయాలనీ పవన్ డిమాండ్..!

April 20, 2021 at 1:42 pm

ప్రస్తుత కరోనా ఉధృతిలో పదో తరగతి పరీక్షలు నిర్వహణ మూర్ఖత్వమే అవుతుందంటూ ఏపీ సర్కార్ నిర్ణయం పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంది పడ్డారు. లక్షలాది విద్యార్థులతో పాటు వారి కుటుంబాలను కూడా కరోనా ముప్పులోకి పడేస్తున్నారంటూ అన్నారు. సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేసిందని, ఒక్క ఏపీ ప్రభుత్వానికి మాత్రమే ఇబ్బంది వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తక్షణమే 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

సి.బి.ఎస్.ఈ, తెలంగాణ విద్యార్థులకు లేని ఇబ్బదులు ఏపీలో మాత్రం ఎందుకు తలెత్తుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ పవన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం 11వ తరగతి, తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకోవాలి. 10వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను తక్షణమే రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు.

ఆ పరీక్షలు రద్దు చేయాలనీ పవన్ డిమాండ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts