క‌రోనా వాక్సిన్ వేయించుకున్న బిగ్ బి..!

ప్రముఖ బాలీవుడ్ న‌టుడు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ తాజాగా క‌రోనా వాక్సిన్ వేయించుకున్నారు. ఆయన క‌రోనా టీకా తీసుకున్న విష‌యాన్ని తానే స్వ‌యంగా సోషల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక ద్వారా తెలిపారు. గురువారం నాడు రాత్రి 11 గంట‌ల టైములో ఆయ‌న తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేస్తూ, గురువారం మ‌ధ్యాహ్నం త‌న కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని బిగ్ బి తెలిపారు.

ఆయన ఇప్పుడు క్షేమంగా ఇంకా సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తెలిపారు. తాను కొవిడ్ టీకా అతి త్వ‌ర‌లోనే తీసుకుంటాన‌ని గ‌త నెల‌లో బిగ్ బి ప్ర‌క‌టించిన విష‌యం అందరికి తెలిసిందే. గ‌త సంవత్సరం బిగ్ బీకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అవ్వటంతో ముంబై లోని నానావ‌తి ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందిన సంగ‌తి కూడా అందరికి తెలిసిందే. ఆ తరువాత ఆయన చికిత్స అనంతరం తిరిగి సురక్షితంగా ఇంటికి చేరారు.