`ఆచార్య‌` విడుద‌ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన చిత్ర‌యూనిట్‌!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న‌ తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా..ఈయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, క‌రోనా కార‌ణంగా షూటింగ్‌కు బ్రేక్‌ ప‌డింది. దీంతో సినిమా విడుద‌ల వాయిదా పడుతుంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి

అయితే ఈ వార్త‌ల‌ను నిజంగా చేస్తూ.. తాజాగా ఆచార్య చిత్ర యూనిట్‌ కీల‌క ప్ర‌కట‌న చేసింది. క‌రోనా మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆచార్య చిత్రాన్ని మే 13న విడుదల చేయడం లేమ‌ని.. ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

Share post:

Latest