నితిన్ బ‌ర్త్‌డే వేడుక‌లో సునీత దంప‌తులు సంద‌డి..వైర‌ల్‌గా ఫొటోలు!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `జయం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నితిన్‌.. తొలి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన దిల్‌, సై చిత్రాలు కూడా హిట్ అవ్వ‌డంతో.. నితిన్‌కు సూప‌ర్ క్రేజ్ దక్కింది.

- Advertisement -

 Happy Birthday Nithiin |యువ హీరో నితిన్ ఈరోజు తన 38వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసారు. నితిన్ బర్త్ డే వేడుకల్లో సింగర్ సునీత దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కానీ, అంత‌లోనే వ‌రుస ఫ్లాల‌ను ఎదుర్కోవ‌డం, కొత్త హీరోల పోటీ ఎక్కువ అవ్వ‌డంతో నితిన్ కెరీర్ రిస్క్‌లో పడింది. అయిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌కుండా వరుస సినిమాలు చేస్తూ.. మ‌ళ్లీ హిట్లు అందుకుని ఫామ్‌లోకి వ‌చ్చేశాడు నితిన్‌. ఇదిలా ఉంటే.. ఈ రోజు నితిన్ 38వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీ, అత్యంత సన్నిహితుల మ‌ధ్య నితిన్‌ కేక్ కట్ చేసారు.

 భార్యతో కలిసి కేక్ కట్ చేసిన నితిన్ (Twitter/Photo)

నితిన్ ఇంట్లోనే జరిగిన ఈ వేడుకలో సింగర్ సునీత దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి. సునీత భర్త రామ్‌తో నితిన్‌కి సన్నిహిత సంబంధాలున్నాయన్న సంగ‌తి తెలిసిందే. సునీత‌, రామ్ వివాహానికి కూడా నితిన్‌, భార్య షాలినీ క‌లిసి వెళ్లారు.

 నితిన్ పుట్టినరోజు వేడుకల్లో సింగర్ సునీత, రామ్ వీరపనేని దంపతలు (Twitter/Photo)

 నితిన్ బర్త్ డే వేడుకలు (Twitter/Photo)

 కుటుంబ సభ్యులతో నితిన్ బర్త్ డే వేడుకలు (Twitter/Photo)

 

Share post:

Popular