బాలయ్య 102 కి విలన్ దొరికేసాడు

నందమూరి బాలకృష్ణ తన 101వ సినిమా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. పైసా వ‌సూల్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 29న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో త‌న 102వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు రెండో వారం నుంచి స్టార్ట్ కానుంది.

ఇక ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఈ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంద‌ట‌. శ్రీకాంత్ ఇటీవ‌ల వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తున్నాడు. గోవిందుడు అందరివాడేలే సినిమాలో చెర్రీకి బాబాయ్‌గా న‌టించిన శ్రీకాంత్ ఇప్పుడు బాల‌య్య పాలిట విల‌న్‌గా మారుతున్నాడు.

గతంలో బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాతో సీనియర్ హీరో జగపతిబాబు విలన్‌గా మారి కెరీర్లో మంచి సక్సెస్ ను చూసిన సంగతి తెలిసిందే. మ‌రి ఇప్పుడు శ్రీకాంత్ విల‌న్‌గా ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే క్రేజీ భామ నయనతార హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.