వరల్డ్‌వైడ్‌గా బాహుబలి -ది కంక్లూజన్ సాగిస్తోన్న వసూళ్ల ప్రభంజనం దెబ్బతో ఇండియన్ సినిమా ట్రేడ్‌వర్గాలు, ఎనలిస్టులు షాక్ అవుతున్నారు. ఇండియన్ సినిమాకే తలమానికంగా చెప్పుకునే బాలీవుడ్ సినిమాలు లైఫ్ టైం లేదా లాంగ్ రన్లో సాధించే వసూళ్లను బాహుబలి కేవలం ఆరు రోజులకే తుడిచిపెట్టేసింది.
బాహుబలి ఈ రేంజ్లో విజృంభిస్తుంటు, ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుంటే బాలీవుడ్ ప్రముఖుల ఎవ్వరూ నోరు మెదపకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాలీవుడ్లో ఏ ఖాన్ సినిమానో ఈ రేంజ్లో వసూళ్లు సాధిస్తుంటే టోటల్ బాలీవుడ్ మొత్తం ఊగిపోయేది.
అమీర్‌ఖాన్ పీకే, దంగల్ సినిమాలు, సల్మాన్ భజరంగీ భాయ్‌జాన్ ఇలా అక్కడి ఖాన్ల సినిమాలు కలెక్షన్లు దుమ్మురేపితే బాలీవుడ్ ప్రముఖులు మొత్తం ట్వీట్లతో ఊపేసేవారు. కానీ బాహుబలి విషయంలో చాలా మంది ప్రముఖులు స్పందించడం లేదు. ఈ సినిమాను అక్కడ పంపిణీ చేసిన కరణ్జోహార్కు అత్యంత సన్నిహితులు సైతం స్పందించడం లేదు.
ఇక ఖాన్లు మాత్రమే కాదు మిగిలిన బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం బాహుబలి ఘనవిజయంపై నోరు మెదపడం లేదు. శేఖర్ కపూర్ లాంటి వాళ్లు ఎంతగా ఈ సినిమాను పొగిడినప్పటికీ… లైమ్ లైట్లో ఉన్న స్టార్ హీరో హీరోయిన్లు.. దర్శకులు ఈ సినిమా గురించి స్పందించపోవడం చూస్తుంటే బాహుబలి సినిమాపై బాలీవుడ్ వాళ్లకు ఉన్న కుళ్లు, అసూయ బయటపడిందన్న సెటైర్లు పడుతున్నాయి.