టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. చిరు రీ ఎంట్రీ ఎలా ఉండాలో అదే రేంజ్ హిట్‌ను ఖైదీ ఇచ్చింది. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులకు పాతరేసి ఏకంగా రూ.100 కోట్ల షేర్ మార్క్ కూడా క్రాస్ చేసేసింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు తన నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నాడు.
చిరు 151వ సినిమా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఉంటుందని…ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా కొణిదెల ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరు తనయుడు రాంచరణే నిర్మించనున్నాడు.
ఇదిలా ఉంటే చిరు పక్కన హీరోయిన్ అంటే ఓ పట్టాన సెట్ కావడం లేదు. ఖైదీ నెంబర్ 150 కోసం అష్టకష్టాలు పడి చివరకు కాజల్ అగర్వాల్‌ను సెట్ చేశారు. ఇప్పుడు మరోసారి హీరోయిన్ విషయంలో చిరుకు ఇబ్బందులు తప్పేలా లేవు. ముందుగా ఈ చిత్రంలో అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ స్థానంలో విశ్వనాయకుడు కమల్ ముద్దుల కుమార్తె, యంగ్ బ్యూటీ శృతి హాసన్ పేరు వినిపిస్తోంది.
ఇటీవల విడుదలైన సింగ-3, ఓం నమో వెంకటేశాయ చిత్రాల్లో అనుష్క కాస్త లావుగా కనిపించడంతో పాటు ఆమె లుక్‌లో మునుపడి అంత ప్రెష్‌నెస్ లేదన్న టాక్ వచ్చింది. దీంతో అనుష్క ప్లేస్‌లో శృతిని హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారట. అదే జరిగితే మెగాస్టార్ పక్కన శృతి ఎలా సెట్ అవుతుందో చూడాలి.