మెగా ఫ్యాన్స్‌కు చెర్రీ షాక్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం కోలీవుడ్ హిట్ మూవీ తనీ ఒరువన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ధృవ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు కంప్లీట్ అయ్యింది.

ఈ సినిమా గురించి భారీ అంచ‌నాలు, ఆశ‌ల‌తో వెయిట్ చేస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు హీరో రాంచ‌ర‌ణ్ పెద్ద షాక్ ఇచ్చారు. ధృవ‌ సినిమాకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను చేయటం లేదని ప్రకటించాడు చరణ్.లాంచింగ్ ఈవెంట్ లేకుండానే ఈ నెల 9న ధృవ ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్‌లోకి రిలీజ్ చేయ‌నున్నారు.

ధృవ ఆడియో ఫంక్ష‌న్ జ‌రిగితే ఆ ఫంక్ష‌న్‌కు మెగా ఫ్యామిలీ హీరోలంద‌రూ వ‌స్తార‌ని …ఈ ప్రోగ్రామ్‌లో మెగా హీరోలంద‌రిని ఒకే వేదిక మీద చూడ‌వ‌చ్చ‌ని ఆశించిన మెగా ఫ్యాన్స్‌కు చెర్రీ ప్ర‌క‌ట‌న పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ధృవ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ఖైదీ నంబర్ 150 ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చెర్రీ ధృవ ఆడియో ఫంక్ష‌న్ విష‌యంలో పెద్ద ఆసక్తితో లేర‌ని టాక్‌.

ఇక ఆడియో ఫంక్ష‌న్ లేకుండా సినిమా రిలీజ్ కు ముందు ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఫంక్షన్ ను విజయవాడ వేదికగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ధృవ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.