అల్లు ఫ్యామిలీకి చెర్రీ చెక్

ఏంటి? స‌ర్‌ప్రైజింగ్‌గా ఉందా?  ఇప్పుడ‌లాగే ఉన్నా.. మొత్తం మేట‌ర్ చ‌దివితే మీరు కూడా ఇలానే డిసైడ్ అయిపోతారు. అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మ‌ధ్య రిలేష‌న్ అంద‌రికీ తెలిసిందే. అటు ఫ్యామిలీ ప‌రంగానే కాకుండా ఇటు బిజినెస్ ప‌రంగా కూడా వీళ్ల‌ది పెద్ద రిలేష‌న్‌. మ‌రి అలాంటి అల్లు ఫ్యామిలీకి చిరు త‌న‌యుడు చెర్రీ చెక్ పెడుతున్నాడంటే విష‌యం ఏమై ఉంటుంది? అస‌లు ఎందుకు చెక్ పెట్టాల్సి వ‌చ్చింది? ఇలాంటి సందేహాలు కామ‌న్‌. అయితే, మూవీ ఫీల్డ్ అన్నాక‌.. ఎప్పుడు  ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో చెప్ప‌డం క‌ష్టం. ఒక‌రు బాగా ఎదిగితే.. వాళ్ల‌ని తొక్కేయాల‌ని ప్లాన్ చేసేవాళ్లు వంద‌ల్లో ఉంటారు.

అయితే, అంత రేంజ్‌లో కాక‌పోయినా.. చెర్రీ కూడా అల్లు ఫ్యామిలీకి దెబ్బ‌త‌గిలేలా.. ఓ ప్లాన్ వేశాడు. ఇది అల్లు ఫ్యామిలీని ఇర‌కాటంలోకి నెట్టేసింది. ప్ర‌స్తుతం అల్లు అర‌వింద్ సొంత బ్యాన‌ర్ గీతా ఆర్ట్స్‌పై చెర్రీ ఓ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న మూవీకి ‘ధృవ’ అని ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం, దీనికి చెర్రీ అభిమానుల్లో క్రేజ్ పెర‌గ‌డం తెలిసిందే. అయితే, గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేకపోవడంతో చరణ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని గ‌ట్టిగా డిసైడ్ అయ్యాడు. ఈ క్ర‌మంలో సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి భారీ స్థాయిలో ప్రమోషన్లు చేయాలని నిర్ణయించుకున్నాడు.

అయితే, ఈ ప్ర‌మోష‌న్ బాధ్య‌త‌ను గీతా ఆర్ట్స్ సంస్థ‌కి కాకుండా జ‌క్క‌న్న బాహుబ‌లి టీం  ‘ఆర్కా మీడియా’కు అప్పగించాడని తెలిసింది. ఇదే ఇప్పుటు అల్లు ఫ్యామిలో పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. వాస్త‌వానికి గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగు మూవీ ఇండ‌స్ట్రీలో మంచి నేమ్‌తో మంచి టీం కూడా ఉంది. అదేవిధంగా ఈ సంస్థ కూడా ప్ర‌మోష‌న‌ల్ యాస్పెక్ట్‌లో బాగానే ప‌నిచేస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. చెర్రీ గీతాను కాద‌ని.. ఆర్కాను ఆశ్ర‌యించ‌డ‌మే ఇప్పుడు వివాదానికి దారితీస్తోంద‌ని చెర్రీ అభిమానులు పేర్కొంటున్నారు. మ‌రి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. ఏదేమైనా.. చెర్రీ ప్లాన్ ఏంటో తెలీదని.. ఆయ‌న అభిమానులు అంటున్నారు.