ప్రత్యేకహోదా భాద్యత ఎవరిది?

ప్రత్యేకహోదా పై మరొకసారి కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డున పడిన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థకి ఏదో మేలుజరుగుతుందని 5 కోట్ల ఆంధ్రులు ఆశగా ఎదురుచూసారు.కానీ చివరకు మన వెక్కయ్య నాయుడు(గారు అనిపించుకునే అర్హతకూడా కోల్పోయారనే ఉద్దేశం తో ), అరుంజేట్లీ కలిసి పాత హరికదే చెప్పి దారుణంగా అవమానించారు.

గత రెండున్నర సంవత్సరాలుగా సంయమనం పాటించి వున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల సహనాన్ని చేతకాని తనంగా నే పరిగణించినట్టు చెప్పకనే చెప్పేసారు. ఇప్పుడు కచ్చితంగా మనం పోరాడాల్సిందే, మన పౌరుషాన్ని చూపించాల్సిన టైం వచ్చింది. ప్రత్యేక హోదా ఆంధ్రులహక్కు దానిని సాధించేవరకు పోరాడాల్సిందే లేకపోతే భావితరాలకు జరగబోయే అన్యాయానికి మనందరం భాద్యత వహించాల్సివుంటుంది. దీనిని ముందుకు నడిపించాల్సిన భాద్యత అధికార తెలుగుదేశానికే ఎక్కువగా వుంది.

కేవలం తెలుగుదేశం పార్టీ బీజేపీ మిత్రపక్షంగా వున్నారు, మీరయితేనే ప్రత్యేక హోదా తేగలరు అనినమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు అధికారం అప్పచెప్పారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోయినా పరిస్థితులని అర్ధం చేసుకుని
మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పక కూడా మీరు బీజేపీ ప్రభుత్వ తీరుని సమర్ధిస్తే మాత్రం కచ్చితంగా 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను కేంద్రానికి తాకట్టుపెట్టినట్టే. దయచేసి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ని తిట్టటం మానేయండి. కనీసం వాళ్ళయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలతరుపున పోరాడతారు ప్రత్యేక హోదా ధిస్తారు.