ఎన్టీఆర్‌కు కోపం ఎందుకు వ‌చ్చింది..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సక్సెస్‌తో ఖుషీ..ఖుషీగా ఉన్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్‌కు ఎప్ప‌టి నుంచో ఉన్న క‌లెక్ష‌న్లు, రికార్డుల దాహాన్ని తీర్చేసింది. ఈ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ ఓ విష‌యంలో తీవ్ర అస‌హ‌నంతో ఉన్నాడ‌ట‌. అస‌లు సంగ‌తి ఏంటంటే జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్ ఫుల్లుగా 5 వ వారంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.135 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రూ.83 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

అయితే ఈ రికార్డుల‌కు మీడియాలో అనుకున్న స్థాయిలో ప్ర‌చారం రావ‌డం లేదు. ఎన్టీఆర్ సినిమా ఈ రేంజ్‌లో వ‌సూళ్లు సాధించింద‌న్న విషయాన్ని ఎవరూ బయట చెప్పలేదు. నిర్మాత‌లు సైతం స్టార్టింగ్‌లో గ్యారేజ్‌కు చేసిన ప్ర‌మోష‌న్ త‌ర్వాత ఆపేశారు. దీనికి ట్యాక్స్ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వారు సైలెంట్ అయ్యారా ?  లేదా ? మ‌రేదైనా కార‌ణం ఉందా ? అన్న రీజ‌న్ మాత్రం తెలియ‌డం లేదు.

 గ్యారేజ్ ఈ స్థాయిలో వ‌సూళ్ల వీరంగం సృష్టిస్తుంటే…సినిమాకు సంబంధించిన కలెక్షన్ల వివరాలు బయటకు రావట్లేదని జూనియర్ అసంతృప్తితో ఉన్నాడని టాక్. ఎన్టీఆర్ న‌టించిన ఏ సిన‌మా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.100 కోట్ల క్ల‌బ్లో చేర‌లేదు. గ్యారేజ్ ఫ‌స్ట్ టైం రూ.100 కోట్లు సాధించ‌డంతో పాటు ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టేసి ఎన్టీఆర్‌తో పాటు ఆయ‌న అభిమానులను ఖుషీ చేసింది.

అయితే బ‌న్నీ స‌రైనోడు సినిమా ఈ సినిమా కంటే త‌క్కువ వ‌సూళ్లు సాధించినా ఆ సినిమాకు అదిరిపోయే ప్ర‌చారం చేసుకున్నారు. అయితే ఇప్పుడు గ్యారేజ్ రికార్డుల‌ను నిర్మాత‌లు ఎందుకు హైలెట్ చేయ‌డం లేదన్న‌దే తార‌క్ అస‌హ‌నానికి కార‌ణంగా తెలుస్తోంది.