మనమంతా TJ రివ్యూ

సినిమా:మనమంతా
టాగ్ లైన్ : మనమంతా చూడాల్సిన సినిమా
TJ రేటింగ్:4/5

నటీ నటులు: మోహన్‌లాల్, గౌతమి ,ఊర్వశి ,రైనా రావ్,అనిషా , నాజర్ , విస్వాన్త్ , గొల్లపూడి , పరుచూరి వెంకటేశ్వరరావు , వెన్నెల కిషోర్ తదితరులు .
నిర్మాత: సాయి కొర్రపాటి
బ్యానర్: వారాహి చలన చిత్రం
మ్యూజిక్: మహేష్ శంకర్
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్
ఎడిటింగ్ : జీవీ చంద్రశేఖర్
డైలాగ్స్: రవి చంద్ర తేజ
స్టోరీ /రైటర్/స్క్రీన్ ప్లే/డైరెక్టర్ : చంద్రశేఖర్ యేలేటి

ఇప్పటిదాకా చేసినవి ఐదే సినిమాలు..దేనికదే ప్రత్యేకం..ప్రతి సినిమాలోనూ ప్రేక్షకుల్ని కట్టి పడేసే సస్పెన్స్ ఉంటుంది..అన్నిటికంటే ముక్యంగా ప్రతి సినిమాలోనూ ఎక్కడో ఓ చోట ప్రతి ఒక్కరు ఆయన సినిమాకి కనెక్ట్ అవుతారు.ప్రతి ఒక్కరి జీవితం లో జరిగే చిన్న చిన్న విషయాలు మనం మర్చిపోతున్న విలువల్ని తట్టి నిద్ర లేపుతూనే వున్నాడు..ఆయనే చంద్రశేఖర్ యేలేటి.

ఇప్పటి దాకా తీసిన ఐదు సినిమాలు ఒక ఎత్తయితే..ఈ మనమంతా సినిమా ఒకెత్తు..యేలేటి ప్రతి సినిమాలోనూ మానవ సంబంధాలు తాలూకు ఎమోషన్స్ ఖచ్చింతంగా ఉంటాయి.అయితే ఫుల్ లెంగ్త్ మానవ సంబంధాలు..వాటి విలువల మీద యేలేటి లాంటి క్రియేటివ్ డైరెక్టర్ ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అదే ఈ మనమంతా.

ఇప్పటి వరకు 3 – 4 కథలు సీక్వెల్ గా రన్ అవుతూ వుండే సినిమాలు మనం చాలా చూసాం కానీ మనమంతా వాటిలో ప్రత్యేకం.సినిమా ఆద్యంతం 4 కథలు వేటికవే పరిగెడుతుంటాయి.కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఆ నాలు కథలు ఒకే కుటుంబానికి చెందిన తల్లి తండ్రి వారి కొడుకు కూతురి కథలే.అసలు ఈ ఐడియా కి యేలేటి కి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే..లేకపోతే ఒకే ఫ్యామిలిలో ఒక్కొక్కరికి ఒకో కథని నడిపిస్తూ ఏ ఇద్దర్ని చివరి 5 నిమిషాల వరకు కలుసుండేటట్లు చూపకుండా స్క్రీన్‌ప్లే రాయడం అంటే కత్తిమీద సామే.దాన్ని ఎంతో అద్భుతంగా ఇంకెంతో పడ్బంది తో కూడిన స్క్రీంప్లై తో యేలేటి సినిమాని నడిపిన తీరు నిజంగా అద్భుత.

ఓ మిడిల్ క్లాస్ ఫామిలీ ఫాదర్ విజేత సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ పెరిగిన కుటుంబ ఖర్చులు,ఎదిగిన పిల్లల పోషణ భారమైన పరిస్థితుల్లో మేనేజర్ గా ప్రమోషన్ కోసం తాపత్రయపడే వ్యక్తిగా మోహన్‌లాల్ అద్భుతంగా నటించాడు.సొంతగా తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పిన మోహన్‌లాల్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే.చాన్నాళ్ల తరువాత గౌతమీ తనదైన సహజ సిద్దమైన నటనతో ఆకట్టుకుంది.ఓ మధ్యతరగతి మహిళగా ఊర్వశితో కలిసి చేసిన సన్నివేశాలన్నీ చాల నాచురల్ గా వున్నాయి..కొడుకుగా విస్వంత్ నటన ఆకట్టుకుంది.అందరిలో ముక్యంగా చెప్పుకోవలసింది కూతురిగా నటించిన రైనా రావ్ అనే అమ్మాయిగురించి.ఎంత సహజంగా నటిచింది ఈ అమ్మాయంటే చూస్తున్నంత సేపు ఇది సినిమా కాదు అనే ఫీలింగ్ లోకి ఆడియన్స్ ని నెట్టేస్తుంది.నవ్విస్తుంది..ఏడిపిస్తుంది..ఏదిచేసినా మనల్ని తనతో పాటు సినిమాలో ఇన్వొల్వె చేసేస్తోంది.అంత అద్భుతంగా చేసింది ఈ పాపా.మిగిలిన వారిలో సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీ రావ్ గారు చాల ముఖ్యమైన పాత్ర పోషించారు.గురువుగారి నటన గురించి చెప్పేదేముంది.హీరోయిన్ గా అనిషా క్యూట్ లుక్స్ తో మంచి మార్కులే కొట్టేసింది.ఊర్వశి,వెన్నెల కిషోర్,నాజర్ ఎవేరి పాత్ర పరిధిలో వాళ్ళు బాగా నటించారు.గెస్ట్ రోల్ లో నందమూరి తారక రత్న కనిపించాడు.

అసలు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే స్క్రీన్‌ప్లే గురించి ఎంత చెప్పినా తక్కువే..అంతగా కట్టిపడేస్తాడు యేలేటి మనల్ని.ఇంత సున్నితమైన మానవీయ సంబంధాలకు అంత గొప్ప స్క్రీన్ ప్లే రాయడం హైలైట్.డైలాగ్స్ పెద్ద పెద్ద వి లేకపోయినా మనం నిజజీవితం లోమాట్లాడుకునే చిన్ని చిన్ని మాటలే సందర్భానికి తగ్గట్టు అద్భుతంగా రాశారు.చైన్ లింక్ ఊడిపోవడాన్ని తెలుగులో సంబంధాలు తెగిపోవడం అంటూ రాయడం నవ్వు తెప్పిస్తుంది..కస్టమర్ ఇంపార్టెన్స్ గురించి గాంధీ గారు చెప్పిన డైలాగ్స్ మోహన్‌లాల్ చెప్పడం అద్భుతంగా వుంది.డబ్బుల్లేక పోవచ్చు కానీ బుద్ది లేకపోలేదు,నిజం చెప్పడం..నిజాయితీగా ఉండడమే మనుషులకి మహాత్ముడికి తేడా..ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవ్వరి జీవితంలో వాళ్ళు తప్పిపోయి తిరుగుతున్నారు లాంటివి మచ్చుకు కొన్ని హైలైట్ డైలాగ్స్.

ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎవరికి వాళ్ళు పడే పడే కష్టాలు..అనుభవించే బాధలకి చిన్న క్రైమ్ కం సస్పెన్స్ ఎలిమెంట్ ని జత చేసి ఒక అద్భుతమైన స్క్రీన్‌ప్లే తో యేలేటి అంతే గొప్పగా తీశాడీ మనమంతా సినిమాని.అనవసరపు డైలాగ్స్,అర్థం పర్థం లేని కామెడీ..విసుగెత్తించే పిచ్చి గెంతులు..పనికిరాని ఫైట్స్ తో విసిగి వేసారి పోయిన తెలుగు ప్రేక్షకుడికి మనమంతా ఒక రెఫ్రెషమెంట్ లా ప్రతి ఒక్కరు నిజ జీవితంలో తమని తాము ఎదో ఒక పాత్రలో చూసుకునే మనందరి సినిమా నే ఈ మనమంతా.

చివరగా..దాదాపు 15 ఏళ్ళ పైగా సినీ ప్రయాణం చేస్తున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మనమంతా సినిమాతో కలిపి చేసినవి 6 సినిమాలే అంటే ఆశర్యమేస్తుంది.నిన్న మొన్న దర్శకత్వం చేపడుతున్న దర్శకులు సైతం మాస్ అని క్లాస్ అని అర్థం పర్థం లేని సినిమాలు ఎడా పెడా తేసేస్తున్న ఈ రోజుల్లో ప్రతిభకు పేటెంట్ రైట్ అంటే చంద్రశేఖర్ యేలేటి అనే చెప్పాలి.ప్రతిభ చాలా మందికుండొచ్చు కానీ యేలేటి దాన్ని హ్యూమన్ లైఫ్ కి రిలేట్ చేస్తూ సినిమాలు తీయడం నిజంగా అద్భుతం.యేలేటి నుండి మరిన్ని చిత్రాలు రావాలని మనమంతా ఆశిద్దాం.