ఏప్రిల్ 28న బాహుబలి-2 రిలీజ్

బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా  భారీగా వసూళ్లను రాబట్టిన  సినిమా. దాని స్వీక్వెల్ గా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న బాహుబలి-2 పై కూడా భారీ  అంచనాలే ఉన్నాయి. రిలీజ్ ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి-2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెలిపారు. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బాలీవుడ్‌లో ‘బాహుబలి’ని  విడుదల చేసిన కరణ్‌… రెండో పార్ట్ బాహుబలి ది కన్ క్లూజన్ హిందీ వర్షెన్ ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టు ప్రకటించారు.

కాగా ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా విడుదల తేదీని ప్రకటించాల్సివుంది.అయితే మొదటి ఈ సినిమాను 14 ఏప్రిల్‌ 2017 విడుదల చేయనున్నట్లు తెలిపారు. తాజాగా విడుదల తేదీలో మార్పు చేశారు.