చరణ్ కి షాక్ ఇచ్చిన కాజల్

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి తో కలిసి ఒక్క సినిమా అయిన చేస్తే చాలు అనుకునే వారు చాలామంది వుంటారు. అదే హీరోయిన్స్ అయితే మెగాస్టార్ తో కలసి ఒక్కసాంగ్ లో అయిన స్టెప్ వేస్తే చాలు అనుకుంటారు.
కానీ కాజల్ మాత్రం అలా అనుకోవటం లేదంట.

మెగాస్టార్ 150 వ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ పేర్లే బయటకి వచ్చాయి ఈ జాబితాలో న‌య‌న‌తార‌, అనుష్క‌, దీపికా ప‌దుకొణే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఇలా చాలా పేర్లు వినిపించినా ఏ పేరు సెట్ కాలేదు.

దీంతో విసిగిపోయిన చెర్రీ తనకు బాగా కలిసివచ్చిన ముద్దుగుమ్మ కాజల్ ను సంప్రదించాడట. అయితే కాజల్ చెప్పిన రేట్ విన్న చెర్రీకి కళ్ళు తిరిగాయంట. ఈ సినిమా చేయటానికి కాజల్ రెండున్నర కోట్లు అడిగినట్టు సమాచారం.

ఈ మధ్యకాలం లో కాజల్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయిన కాజల్ ఎందుకు ఇంత డిమాండ్ చేసిందంటే ఆల్రెడీ ఇండస్ట్రీ కి వచ్చి 10 ఏళ్ళు అయింది ఇంకా మహా అంటే ఒకటి లేదా రెండు సంవత్సరాలే కదా అని వీలైనంత వెనకేసుకోవటానికి చూస్తుంది అని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.