టార్గెట్ జూనియర్ – లేపేయ్ దుమారం

ఆయన్ని ఎన్నికల ప్రచారం లో వాడుకున్నారు,తాతకి తగ్గ మనవడని కితాబిచ్చారు,అబ్బో ఒకటా రెండా ఏకంగా అందలమే ఎక్కిన్చేసారు జూనియర్ NTR ని TDP వర్గాలు మరీ ముక్యంగా చంద్రబాబు నాయుడు.ఒక సారి గతం లోకి వెళ్తే ఇదే నారా నందమూరి జూనియర్ NTR కెరీర్ బెగినింగ్ లో అతనెవరో అన్నట్టు, మాకు జూనియర్ కి సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు.ఒక్క సారి NTR కి సక్సెస్ రాగానే మొత్తం బెటాలియన్ అంత NTR మావాడే అసలు మేమే NTR ని పైకి తెచ్చాం అని డప్పులు కొట్టడం ప్రారంభించారు.అదంతా గతం ఇప్పుడు పవన్ అనే ఆయుధం దొరికింది ఇంకేముంది జూనియర్ కరివేపాకు అయ్యాడు అంతేనా జూనియర్ ని నందమూరి వంశానికి వంసాభిమానులకి దూరం చేసే కుట్ర జరిగింది జరుగుతూనే వుంది.

కాగా తాజాగా జూనియర్ NTR మా అవార్డ్ ఫంక్షన్ లో చేసిన స్పూర్తి వ్యాక్యలని కుడా వక్రీకరించి NTR పై విషం చల్లే ప్రయత్నం జరుగుతోంది.ఇంతకి NTR చేసిన ఆ ఘోరమైన తప్పేంటా అనుకుంటున్నారా?ఏమి లేదు NTR నోట మెగాస్టార్ చిరంజీవి పేరు రావడమే.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమాలో మంచి నటన ప్రదర్శించినందుకు గాను మాటివి అవార్డ్స 2016 లో యన్టీఆర్ కు ఉత్తమ నటుడు అవార్డు వరించింది. ఈ సందర్భంగా యన్టీఆర్ మాట్లాడుతూ మాకు ఎన్నేళ్లు వచ్చినా.. ఎన్నేళ్లు ఇండ్రస్టీలో ఉన్నా మా అందరికీ స్ఫూర్తి మాత్రం తాత అయిన నందమూరి తారక రామరావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ లతో పాటు చిరంజీవి , బాలకృష్ణ, నాగార్జున అంటూ చెప్పడం.అయినా చిరంజీవిని స్ఫూర్తి అంటే తప్పెంతని NTR అభిమానులే ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్ని పక్కన పెడితే చిరంజీవి సినీ జీవితం ఎందరికో స్పూర్తి నిచ్చింది అన్నది నిర్వివాదాంశం.NTR చిరంజీవితో పాటు పాత కొత్త తరం హేమహేమిలందరినీ స్పూర్తి గా చెప్పుకొచ్చారు.అయినా బురద చల్లలనుకునే వారికి కంటెంట్ తో పనేముంది కటౌట్ వుంటే చాలు.