ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నిక ట్విస్టులతో రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడం, తర్వాత హఠాన్మరణం చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన మృతి చెంది సెప్టెంబర్ 12వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ లోగానే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాలుగైదు రోజుల్లోనే నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ […]
Tag: ysrcp
నంద్యాలలో టీడీపీకి వైసీపీ గట్టిపోటీ!
నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందే అధికార పార్టీ టీడీపీ ఎన్నికల వేడిని అమాంతం పెంచేసింది. సాక్షాత్తూ.. చంద్రబాబే నేరుగా నంద్యాలలో ఇప్పటికి రెండు సార్లు పర్యటించారు. రాత్రు ళ్లు కూడా ఆయన అక్కడే మకాం వేస్తూ.. ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుబట్టారు. మరి అధికార పక్షం ఇంతచేస్తే.. అసలు ఈ సీటు నుంచి 2014లో గెలుపొందిన వైసీపీ ఊరుకుంటుందా? జగన్ అసలు ఊరుకుంటాడా? మళ్లీ తామే ఈ సీటు నుంచి గెలిచి […]
కొత్త పలుకులో చెత్త ఆలోచనలో…ఈ గ్యాసిప్‌కు అంతేలేదా!
లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చెప్పడం కొన్ని పత్రికలకు అలవాటుగా మారిందనే నానుడి తెలిసిందే. తాజాగా ఆంధ్రజ్యోతి అధినేత ఆదివారం రాసిన కొత్త పలుకు ఈ నానుడిని మరోసారి రుజువు చేస్తోంది! వారం వారం ఎడిట్ పేజీలో అరసగం పైనే అచ్చొత్తే.. ఈ వ్యాఖ్యానం ఇటీవల పూర్తి నిరాధారంగా మారిపోయిందని, అతిశయోక్తులకు అడ్డాగా మారిపోయిందని పలువురు చెప్పుకోవడం ఆశ్చర్యంగా అనిపించినా నిజం. తాజా విషయానికి వస్తే.. చాన్నాళ్ల తర్వాత ఏపీ నుంచి రాజ్యాంగ బద్ధ పదవైన ఉపరా […]
జగన్ ప్లాన్‌లో బాబును ముంచుతున్నాడా..!
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వాతావరణం ఎదురవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా పదవులపై ఆశలు పెట్టుకున్న వారి విషయంలో వారు ఏ పార్టీకి పరిమితం అవుతారు? అని చెప్పడం ఇంకా కష్టం. నిన్న మొన్నటి వరకు పదవులపై ఆశలతోనే వైసీపీ నుంచి టీడీపీకి వరుస పెట్టి జంప్ చేసిన నేతలను మనం చూశాం. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు పాటుపడుతున్నారని అందుకే తాము పార్టీ మారామని చెప్పుకొచ్చిన నేతలు ఎక్కడ తమకు అనుకూలంగా ఉంటే అక్కడి జంప్ చేయడానికి సిద్ధంగా […]
టీడీపీకి హ్యాండ్ ఇచ్చి.. జగన్ చెంతకు మాజీ ఎమ్మెల్యే
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి జరుగుతోన్న ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందా ? అని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఆసక్తిగా ఉంది. అక్కడ రోజు రోజుకు పరిస్థితులు మారుతున్నాయి. నంద్యాల ఉప నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీలు వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ ఏకంగా 6 గురు మంత్రులు, 12 మంది ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడంతో పాటు ఏకంగా 10 శాఖల […]
టీడీపీ టు వైసీపీ.. యూ టర్న్ ఎమ్మెల్యేల లిస్ట్ ఇదే
టీడీపీ మొదలుపెట్టిన `ఆపరేషన్ ఆకర్ష్` దెబ్బకు ప్రతిపక్ష వైసీపీ గిలగిల్లాడిపోయింది. అభివృద్ధిని చూసి వచ్చారని టీడీపీ చెబితే.. ప్రలోభాలకు లొంగిపోయారని వైసీపీ నేతలు వారికి బదులు ఇవ్వడం తెలిసిందే! అయితే ఇప్పుడు టీడీపీ నేతలకు దిమ్మతిరిగే షాక్ తగలబోతోందట. అభివృద్ధిని చూసి పార్టీలోకి వెళ్లిన నేతలు.. ఇప్పుడు అంతే వేగంతో యూ టర్న్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ జోరుగా నడుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందో లేదో స్పష్టత లేకపోవడం, మరోపక్క వైసీపీ అధినేత ప్రకటించిన నవరత్నాలు […]
వైసీపీ నావ వైసీపీ వాళ్లే ముంచేస్తున్నారు…
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత జగన్ చావో రేవో పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్తగా నార్త్‌కు చెందిన ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించారు. పీకే కూడా ఏపీలో తన వర్క్ స్టార్ట్ చేసేశాడు. పీకే బృందాలు ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం అమరావతిలో జరిగిన ప్లీనరీలో జగన్ నవరత్నాల పేరుతో ఎన్నికల హామీలు కూడా ప్రకటించేశాడు. జగన్ 2019 ఆపరేషన్ పేరుతో గెలుపు కోసం ఇంత […]
కాంగ్రెస్ గూడు ఖాళీ.. వైసీపీలోకి మాజీ మంత్రి
ఏపీలో ఎలాగైనా సరే మళ్లీ అస్థిత్వం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో సాకారమయ్యేలా లేవు. విభజన తాలూకు ఆగ్రహం ఇంకా ప్రజల్లో కనిపిస్తూనే ఉంది. దీంతో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ పార్టీలోని సీనియర్ నేతలు ఒక్కక్కరుగా జెండాలు మార్చేసి.. తమ భవిష్యత్తును చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, కడపకు చెందిన డీఎల్ రవీంద్రా రెడ్డి కూడా ఫ్యూచర్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు జెండా మార్చేయాలని డిసైడ్ అయ్యారు. […]
నంద్యాల ఎలక్షన్ బడ్జెట్ అన్ని కోట్లా!
ఎన్నికలు వస్తే చాలు ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలు సామబేధదండోపాయాలు ఆలోచిస్తుంటాయి! అది సాధారణ ఎన్నిక అయినా, సర్పంచ్ ఎన్నిక అయినా.. ధన ప్రవాహానికి మాత్రం అడ్డూఅదుపూ ఉండదు. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి! గెలుపు కోసం అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం పోటీపోటీగా తలపడుతున్న నేపథ్యం లో.. ఈ ఎన్నికల్లో ఎంత ఖర్చు ఎంతవుతుందనే సందేహం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నోట్ల కట్టలకు రెక్కలు వచ్చే అవకాశాలు స్పష్టంగా […]