సర్వే కిటుకు..అందుకే వైసీపీ హవా!

ఈ మధ్య వస్తున్న నేషనల్ సర్వేల్లో వైసీపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపేకే అధికారం దక్కుతుందని నేషనల్ మీడియా సర్వేల్లో తేలింది. అంటే నెక్స్ట్ కూడా తమదే అధికారమని వైసీపీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నాయి. ఇంకా తమకు తిరుగులేదని అనుకుంటున్నారు. అవును సర్వేలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది…ఇటీవల వచ్చిన ఇండియా టీవీ సర్వేలో వైసీపీకి 19, టీడీపీకి 6 ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. అలాగే ఇండియా టుడే […]

అంబటి రాంబాబుకు పవన్ చెక్?

ఏ  వర్గం నేతలు…ఆ వర్గం నేతలనే తిడతారు…ఏపీ రాజకీయాల్లో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఉదాహరణకు చంద్రబాబుని తిట్టాలంటే కమ్మ వర్గానికి చెందిన కొడాలి నాని ముందు ఉంటారు…అలాగే పవన్ ని తిట్టాలంటే కాపు వర్గానికి చెందిన నేతలు బయటకొస్తారు. వైసీపీలోని కాపు వర్గం నేతలు…ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి పవన్ పై ఫైర్ అవుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు ముందు ఉన్నారు. అయితే అంబటి […]

కృష్ణాలో వైసీపీకి బిగ్ షాక్‌… ప‌ద‌వికి రాజీనామా చేసిన కీల‌క‌నేత‌..

కృష్ణా జిల్లాలో అధికార వైసిపికి భారీ షాక్ తగిలింది. ఉయ్యూరు జడ్పీటీసీ య‌ల‌మంచిలి పూర్ణిమ తన పదవికిి రాజీనామా చేశారు. త‌న‌ రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. వైసిపి అంటేనే గ్రూప్ రాజకీయాలు అధికంగా ఉండే పార్టీ. అసలే కృష్ణా జిల్లా… ఉయ్యూరు పెన‌మలూరు నియోజకవర్గంలోకి వస్తుంది. వైసీపీ మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఇక్క‌డ‌ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రధానంగా పార్టీలో ఉన్న పెద్దల నియంతృత్వ ధోరణి నచ్చక పూర్ణిమ‌ జడ్పిటిసి పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. […]

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్‌.. సంక్షేమం ఓట్లు రాల్చ‌డం క‌ష్ట‌మేనా?

ప్ర‌జ‌ల మ‌న‌స్త‌త్వం ఎలా ఉంటుంది.. అని అడిగితే.. ప్ర‌ముఖ నాయ‌కుడు ఒక‌రు ఇలా అన్నారు.. “ఉగాది ప‌చ్చ‌డి లాంటిది“అని! ఔను.. ష‌డ్ర‌శోపేత‌మైన ఉగాది ప‌చ్చడిలాగే ప్ర‌జ‌ల నాడి ఉంటుంద‌నేది నిజం. ఏ నాయ‌కుడైనా.. ఏ పార్టీ అయినా.. అన్ని ర‌కాలుగా.. అన్ని విధాలుగా త‌మ‌ను ఆద‌ర్శిస్తుందంట‌నే.. ఆ పార్టీకి, ఆ నేత‌కు ప్ర‌జలు జైకొడ‌తారు. లేదు.. మేం ఒక‌వైపే చూస్తాం! అంటే.. ఇది విక‌టించే ప్ర‌మాద‌మే ఎక్కువ‌. ఇప్పుడు ఈ విష‌యమే తాజాగా.. ఏపీ అధికార పార్టీ […]

తమ్ముడుకు ఛాన్స్ ఇస్తున్న కేశినేని

గత కొన్ని రోజులుగా టీడీపీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే…గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఈయన ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీపై ఏ స్థాయిలో విమర్శలు చేశారో తెలియదు గాని, సొంత పార్టీపై బాగానే విమర్శలు చేశారు. అలాగే కొందరు నేతలని టార్గెట్ చేసి నాని విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక సొంత తమ్ముడు కేశినేని శివనాథ్(చిన్ని) టార్గెట్ గా కూడా నాని ఫైర్ అయిన […]

జగన్-బాబు: ఎవరి డప్పు వారిదే..!

ఏపీ నాయకులకు రాజకీయం చేయడానికి ఏ స్టేజ్ అయిన ఓకే అన్నట్లు ఉంది…అసలు తాము ఎక్కడైనా రాజకీయమే చేస్తాం అన్నట్లుగా నేతల తీరు ఉంది…అలాగే తమని తాము పొగుడుకోవడం, ప్రత్యర్ధులని తిట్టడం. ఇదే పని మీద ఉన్నారు. అయితే విచిత్రంగా తాజాగా ఆగష్టు 15 వేడుకలని సైతం…సొంత డప్పు కోవడం వాడేసుకున్నారు…చంద్రబాబు, జగన్.. సాధారణంగా ఏ సభలోనైనా ఈ ఇద్దరు నేతలు చేసేది ఒకటే అని, కానీ ఆగష్టు 15 వేడుకల్లో కూడా ఇలా చేయడంపై జనం […]

ఎన్టీఆర్ గడ్డ ఈసారైనా దక్కుతుందా?

పామర్రు నియోజకవర్గం ఎన్టీఆర్ పుట్టిన గడ్డ…నిమ్మకూరు గ్రామం ఈ నియోజకవర్గంలోనే ఉంది. అయితే ఇక్కడ టీడీపీ ఇంతవరకు గెలవలేదు. 2009 ముందు వరకు పామర్రు..గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. అప్పుడు గుడివాడలో టీడీపీ సత్తా చాటేది. ఎప్పుడైతే నియోజకవర్గాల పునర్విభజన జరగడం, పామర్రు నియోజకవర్గం ఏర్పడటం, పైగా ఎస్సీ రిజర్వడ్ కావడంతో…ఇక్కడ టీడీపీ బలం తగ్గిపోయింది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014లో వైసీపీ గెలిచింది..ఇక వైసీపీ తరుపున గెలిచిన ఉప్పులేటి కల్పన టీడీపీలోకి వచ్చారు. అయినా సరే […]

సర్వే: ‘ఫ్యాన్’ స్పీడ్ తగ్గుతుంది..!

అవును ఏపీలో వైసీపీ బలం నిదానంగా తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది…గత ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలవడమే కాకుండా…పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, ఉపఎన్నికలు…ఇలా ఎన్నికలైన సత్తా చాటిన వైసీపీ..ఇప్పుడు వీక్ అవుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ విషయం తాజాగా వెలువడుతున్న సర్వేల్లో స్పష్టంగా కనబడుతోంది. ఆ మధ్య వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తేలింది…కానీ గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు బలం తగ్గిందని రుజువైంది. అయితే ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో కూడా […]

గిద్దలూరులో ‘ఫ్యాన్స్’ కుమ్ములాట!

గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో అన్నా రాంబాబు రెండోస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే…జగన్ తర్వాత ఈయనకే భారీ మెజారిటీ వచ్చింది..పులివెందులలో జగన్ 90 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిస్తే…గిద్దలూరులో రాంబాబు 80 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు…మరి ఇంత భారీ మెజారిటీతో గెలిచిన రాంబాబు..అంతే భారీ స్థాయిలో ప్రజలకు అండగా ఉంటున్నారా? అంటే పెద్దగా ఉండటమే లేదనే చెప్పొచ్చు. ఏదో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు గాని…ఈయన పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో […]